ఆమెకు చదువంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి ఉన్నత పూర్తి చేసింది. బాగా చదువుని మంచి హెదాలో స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అనుకుంది. దీని కోసం ఆ యువతి ఎంతో కష్టపడింది. అలా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తుండగా ఆ యువతికి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం. ఇక అంతా బాగానే ఉంది అనుకునే క్రమంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. అసలు ఈ యువతి ఎవరు? ఆమె జీవితంలో జరిగిన విషాదం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా విజయవాడలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఈ యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఈ యువతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణించిన అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక జీవితంలో మంచి హోదాలో స్థిరపడి కన్నవారికి మంచి పేరును తేవాలనుకుంది. ఇందులో భాగంగానే ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆ యువతి ఇటీవల హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం. అలా ఆమె జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. అయితే డ్యూటీలో భాగంగా ఆ యువతి తన స్నేహితుడితో కలిసి బైక్ పై భద్రాచలం బయలుదేరారు.
తమ పని ముగించుకుని తిరుగు హైదరాబాద్ పయనమయ్యారు. పాలకూర్తి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వెనుక నుంచి ఓ టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆ యువతి కింద పడడంతో ఆమె తలపై నుంచి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ యువతి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో బైక్ నడిపిన ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.