ఇద్దరిది ఒకే మండలం, పక్క పక్క గ్రామాలు. వీరికి గత కొంత కాలం నుంచి పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరు తరుచు మాట్లాడుకునేవారు. అలా రాను రాను వీరి మాటలు ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తేలియాడారు. ఆ తర్వాత సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. కట్ చేస్తే వీరి ప్రేమ ఊహించని మలుపుకు తిరిగి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వీరి ప్రేమ కథలో అసలేం జరిగింది? ఎందుకు ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది జనగామ జిల్లా వడ్లగొండ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన కావేరి ( 19) అనే యువతి ఇంటర్ వరకు చదువుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఓ చోట టెలికాలర్ గా పనికి కుదిరింది. అయితే పని చేసే చోట కిర్యాల గ్రామానికి చెందిన అరవింద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అలా వీరి పరిచయం కొన్నాళ్ల తర్వాత ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో ఆ యువకుడు నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా నేను ఉండలేను.. అంటూ యువతికి అనేక మాటలు చెప్పాడు. అలా కొన్నేళ్ల పాటు వీరిద్దరి ప్రేమాయణం బాగానే కొనసాగింది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని ప్రియుడు అరవింద్ కు చెప్పడంతో అతడు షాక్ కు గురయ్యాడు.
నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ అరవింద్ కావేరికి చెప్పాడు. ప్రియుడు ఉన్నట్టుండి అలా చెప్పడంతో కావేరి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థంకాక తీవ్ర మనస్థాపానికి లోనైంది. అయితే ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో కావేరి ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుకున్న ఆ యువతి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక తట్టుకోలేని కావేరి తల్లిదండ్రులు అన్ని వివరాలు తెలుసుకుని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించారు. మా కూతురు మరణానికి కారణమైన అరవింద్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.