ఓ భర్త.. భార్య మీద కోపంతో తన కూతుళ్లపై పగ తీర్చుకున్నాడు. కనికరం లేకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త.. భార్యపై కోపంతో అభం, శుభం తెలియని తన ఇద్దరి కూతుళ్లపై పగ తీర్చుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? జనగామ జిల్లా పాలకూర్తి మండలం గూడురు జానకీపురం గ్రామం. ఇక్కడే గుండె శ్రీను-ధనలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పదేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి కూతుళ్లు నాగప్రియ (9), నందిని (5)తో పాటు ఓ ఓ కుమారుడు జన్మించారు.
ఇక భర్త శ్రీను స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే రాను రాను భార్యాభర్తల మధ్య మనస్పర్థలు భగ్గుమన్నాయి. దీంతో తరుచు గొడవ పడేవారు. ధనలక్ష్మి తల్లిదండ్రులు స్పందించి గ్రామంలోని పెద్దలతో పంచాయితీ పెట్టించారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? గతంలో భార్యను వేధించిన కేసులో భాగంగా భర్త శ్రీను జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అలా కొంత కాలం పాటు బాగానే ఉన్నారు. అయినా తీరు మార్చుకోని శ్రీను మళ్లీ భార్యను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. ఇక తట్టుకోలేకపోయిన ధనలక్ష్మి కూతళ్లను భర్త వద్దే వదిలేసి కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య తనను కాదని వెళ్లిపోయిందని శ్రీను ధనలక్ష్మిపై పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే అతడు రాక్షసుడిలా మారాడు. భార్యపై కోపంతో తన కూతుళ్లపై తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే శ్రీను ఏప్రిల్ 6న కూల్ డ్రింక్స్ విషం కలిపి తన ఇద్దరి కూతుళ్లకు తాగించాడు. అది తాగిన ఇద్దరు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పెద్ద కుమార్తె నాగప్రియ సోమవారం చనిపోయింది. ఇక చిన్న కూతురు నందిని పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కూతురు చనిపోవడంతో తల్లి ధనలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భార్యపై కోపంతో కూతుళ్లపై తీర్చుకున్న ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.