తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మంజుల అనే మహిళకు హైదరాబాద్ కు చెందిన వినోద్ తో గతంలో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంత కాలం నుంచి భర్త వినోద్ మరో మహిళను పెళ్లి చేసుకుని కొత్త కాపురాన్ని మొదలు పెట్టాడని భార్యకు తెలిసింది.
దీంతో కోపంతో ఊగిపోయిన భార్య భర్తను పలుమార్లు ప్రశ్నించింది. అయితే ఇదే విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక భార్య భర్తకు ఎన్నిసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త అస్సలు మారటం లేదు. మంజుల ఇటీవల తన పుట్టినిల్లు అయిన జనగామకు కొడుకుతో పాటు వెళ్లింది. భార్య పక్కా ప్లాన్ తో భర్తను చంపాలని ప్లాన్ లో ఉంది. ఇక అనుకున్నట్లుగానే భర్తకు ఫోన్ చేసి జనగామకు రప్పించుకుంది.
ఇది కూడా చదవండి: ఆస్పత్రిలో పాడుపని.. అందరి ముందే యువతిపై కోరిక తీర్చుకున్న కామాంధుడు!దీంతో మరోసారి అక్కడ వీరిద్దర మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన భార్య మంజుల కొడుకు సాయంతో భర్త కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచి భర్తను దారుణంగా హత్య చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ భాగంగా భార్య మంజులతో పాటు కొడుకుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.