తాగుడు మనిషిని ఎంతకైన దిగాజారేలా చేస్తుంది. తాగిన మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఎంతటి దారుణాలు చేయడానికైన వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే పీకలదాక తాగిన ఓ యువకుడు కన్నతల్లి అనే కనికరం మరిచి దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఎక్కడ జరిగింది? ఆ యువకుడు కనిపెంచిన కన్న తల్లిని కొట్టి చంపడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకందాం.
జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లా అఘ్ముగం ప్రాంతం. ఇక్కడే జావెద్ అహ్మద్ అనే యువకుడు తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. ఇకపోతే ఆ యువకుడు స్థానికంగా ఎక్కడా సరిగ్గా పనిచేయకుండా చేతులో ఉన్న డబ్బులతో తాగుడుకు బానిసయ్యాడు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో తల్లిని వేధించి డబ్బులు తీసుకునేవాడు. ఇలా రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిని వేధిస్తుండేవాడు. ఇదిలా ఉంటే జావెద్ అహ్మద్ ఇటీవల ఓ రోజు పీకల దాక తాగి ఇంటికొచ్చాడు. ఇక రావడమే కాకుండా ఏదో విషయంలో తల్లితో గొడవకు దిగాడు. దీంతో తల్లిని అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఇక ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు తల్లిపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో కనిపెంచిన పాపానికి తల్లిపై క్షణికావేశంలో అన్యాయంగా దాడి చేశాడు.
జావెద్ అహ్మద్ దాడిలో ఆ తల్లి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇక ఇతనికి దాడిని అడ్డుకోబోయిన ముగ్గురు వ్యక్తులపై కూడా అతడు దాడి తీవ్రంగా చేశాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తాగిన మత్తులో కన్న తల్లిని దారుణంగా హత్య చేసిన ఈ దుండగుడి కిరాతకం ఎంత వరకు సమంజసం? ఇలాంటి దుర్మార్గులను ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.