రాను రాను సమాజంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తూ వివాహేతర సంబంధాల కోసం అడ్డొచ్చిన భర్తను, భార్యను సైతం హత్య చేయడానికి వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే ఓ భర్త ఇటీవల ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. భార్య చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కక్కుర్తుపడి కట్టుకున్న భార్యను హత్య చేశాడు. తాజాగా జైపూర్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
జైపూర్ కు చెందిన షాలు, మహేశ్ చంద్ అనే భార్యాభర్తలకు 2015లో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. అలా కొన్నేళ్ల పాటు వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే కొన్నేళ్ల పాటు ఆనందంగా సాగిన వీరి సంసారంలో భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చాయి. దీంతో భర్త భార్యను తరుచు వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే భార్య భర్తపై భార్య గృహహింస కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఈ దంపతులు ఏ టైమ్ లో ఏం జరిగుతుందోనని తెలియక జీవిత బీమాలో ఇన్సూరెన్స్ పేరుతో కొంత డబ్బును జమ చేసుకున్నారు. అలా ఏడాదికి కొంత జమ చేయడంతో అవి దాదాపుగా కోటికిపైనే జమ అయ్యాయి. ఇన్ని డబ్బులు జమ కావడంతో భర్తకు డబ్బుపై ఆశ పెరిగింది. ఈ డబ్బంతా నాకే చెందాలని అనుకున్నాడు. అడ్డుగా భార్య ఉండడంతో తన పప్పులు ఉడకవని అనుకున్నాడు. ఈ క్రమంలోనే భర్తకు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది.
అయితే ఇన్సూరెన్స్ డబ్బులు నేను ఒక్కడినే తీసుకోవాలంటే భార్య బతికి ఉండకూడదనుకున్నాడు. ఇందుకోసం తన భార్యను హత్య చేయాలనుకున్నాడు. ఇక భర్త అనుకున్నదే ఆలస్యం.. వెంటనే ఓ నాటకానికి తెరతీశాడు. ఇటీవల తన భార్య వద్దకు వెళ్లి.. నేను తాజాగా ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లానని, మన మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే దాదాపు 11 రోజుల పాటు తెల్లవారు జామున హన్ మాన్ గుడికి వెళ్లి పూజలు చేయాలని నమ్మించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన భార్య భర్త చెప్పినట్టే కొన్ని రోజుల పాటు రోజూ తెల్లవారుజామున హన్ మాన్ దేవాలయానికి వెళ్లి పూజలు చేసేది.
అయితే ఈ క్రమంలోనే భర్త తన ప్లాన్ తో వెళ్లాడు.. తాజాగా భార్య తెల్లవారుజామున గుడికి వెళ్తుండగా కారుతో ఫాలో అయి తన భార్యను ఢీ కొట్టించాడు. ఈ దాడిలో తన భార్య ప్రాణాలు కోల్పోయింది. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా భర్తను తమదైన శైలీలో విచారించడంతో అసలు నిజాన్ని బయటపట్టాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన భార్యను హత్య చేశానంటూ భర్త మహేశ్ చంద్ ఒప్పుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.