వరసకు చెల్లి అయ్యే అమ్మాయిని ప్రేమించాడు. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, చివరికి ఇలా చేస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. అసలేం జరిగిందంటే?
ఇతని పేరు బోగే ప్రసాద్. వయసు 23 ఏళ్లు. చిన్నప్పటి తల్లిదండ్రుల వద్దే ఉంటూ కొంత వరకు చదువుకున్నాడు. అయితే ప్రసాద్ అప్పుడప్పుడు వరసకు చెల్లి అయ్యే అమ్మాయి ఇంటికి వెళ్తుండేవాడు. అన్నా, చెల్లెల్లు ఇద్దరూ మాట్లాడుకునేవారు. కానీ, రాను రాను అన్నా చెల్లెలు కాస్త ప్రేమికులుగా మారారు. అవును.. మీరు చదివింది నిజమే. ఇద్దరు ఒకరినొకరు నచ్చుకోవడంతో ప్రేమించుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచింది. ఇక ఏమైనా సరే ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే ప్రసాద్ 3 నెలల క్రితం చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ, చివరికి ఇలా చేస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామం. ఇక్కడే బోగే ప్రసాద్ (23) అనే యువకుడు నివాసం ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటూ స్థానికంగా చదువుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే వరసకు చెల్లి అయ్యే అమ్మాయితో మాట్లాడుతుండేవాడు. ఆ అమ్మాయి కూడా ప్రసాద్ తో మాట్లాడుతుండేది. అలా రాను రాను ఇద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ఇంకేముంది.. అన్నాచెల్లెలు కాస్త ప్రేమికులుగా మారిపోయారు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ గా ప్రేమాయణాన్ని కొనసాగించారు. ప్రసాద్ మాత్రం ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భావించాడు. అనుకున్నట్లుగానే 3 నెలల కిందట చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి, యువకుడి తల్లిదండ్రులు అంతా షాక్ గురయ్యారు. ఇది తప్పని, అమ్మాయిని వదిలేయాలంటూ పెద్దలు చెప్పడంతో వదిలేశాడు.
అనంతరం ఊర్లో ఉండడం కరెక్ట్ కాదని ప్రసాద్ వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడే ఏదైనా జాబ్ చూసుకోవాలని అనుకున్నాడు. ఇకపోతే ప్రసాద్ ఈ నెల 22న తిరిగి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కకపోవడం, ఊళ్లో జనాలు అంతా సూటి పోటి మాటలతో హేళన చేసి మాట్లాడడం చేశారు. దీంతో ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక సోమవారం అర్థరాత్రి ప్రసాద్ ఊరి బయటకు ఉన్న ఓ వ్యవసాయ పొలంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరసటి రోజు ఉదయం ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.