జగిత్యాల- తన ముగ్గురు కూతుళ్లను ఆ తండ్రి ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. తన కుమార్తెలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఘనంగా పెళ్లిళ్లు చేయాలని, అందుకు కావాల్సిన డబ్బు సంపాదించేందుకు దేశాన్ని విడిచి దుబాయ్ వేళ్లాడు. అక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాడు. ముందు పెద్ద కూతురు పెళ్లి చేయాలని అనుకున్నాడు.
ఇది చదవండి: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక.. ప్రియుడు చేసిన పని..
ఐతే పెద్ద కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుతో రెండో కూతురు తన ప్రేమికుడితో కలిసి చెక్కేసింది. దీంతో ఆ తండ్రి చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంలో చోటుచేసుకుంది. మన్నెగూడేనికి చెందిన ఓ వ్యక్తి ఉపాధికోసం రెండేళ్ల క్రితం ఎడారి దేశం దుబాయ్ వెళ్లాడు. తన ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురు వివాహం చేద్దామని నిర్ణయించుకుని. నెలక్రితం సొంత ఊరుకు వచ్చాడు.
ఇది చదవండి: కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన గ్రామస్థులు!
దుబాయ్ లో కష్టపడి పనిచేసి ఇన్నాళ్లూ సంపాదించిన 6.40 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో పెట్టాడు. ఇంకేముంది దీన్ని గమనించిన ఆయన రెండో కూతురు, ఆ సొమ్ము తీసుకుని తాను ప్రేమించిన ప్రియుడిచో కలిసి పదిరోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింజి. అంతే, ఈ విషయం తెలిసి ఆ తండ్రి గుండె పగిలింది. చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడా తండ్రి.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల ప్రత్యేక బృందం పారిపోయిన ప్రేమికుల కోసం గాలింపు చేపట్టాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి దగ్గర ఆ ప్రేమ జంటను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. అంతే కాదు ఆ జంట నుంచి 6 లక్షల రూపాయలను రికవరీ చేశారు. ఆ డబ్బును బాధితుడికి అందించారు పోలీసులు. పెద్దకూతురు పెళ్లి కోసం దాచిన డబ్బును మళ్లీ దొరకడంతో ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు.