పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు రాణి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదుకుంది. చిన్న కూతురు కావడంతో తల్లిదండ్రులు గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఇక అడిగిందల్లా కొనిపెడుతూ.. ఉన్నత చదువులు చదివించారు. చదువు కూడా పూర్తైంది. ఈ క్రమంలోనే ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ యువతికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు అనేక సార్లు చెప్పి చూసింది. తల్లిదండ్రులు మాత్రం ఆ యువతి మాటను లెక్కచేయలేదు. దీంతో చేసేదేం లేక ఆ యువతి ఊహించిన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది జోగులాండ గద్వాల జిల్లి ఇటిక్యాల మండలం కొండేరు గ్రామం. ఇక్కడే కోటమ్మ, హన్మంతు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె పేరు రాణి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటూ చదువుకుంది. ఇక కూతురుకి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయం తీసiకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో అనేక చోట్ల పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ ఎందుకో రాణికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. యువతి ఇదే విషయమై తల్లిదండ్రులకు అనేక సార్లు చెప్పి చూసింది. కానీ తల్లిదండ్రులు మాత్రం కూతురు మాట అసలే వినలేదు. అయితే బుధవారం ఉదయం తల్లిదండ్రులు పనులు వెళ్లగానే ఆ యువతి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది.
సాయంత్రం ఇంటికొచ్చి చూడగా కూతురు ఇంట్లో కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఖంగారుపడి బంధువులకు ఫోన్ చేసి ఆమె ఆచూకి గురించి అడిగి తెలుసుకున్నారు. అందరూ మా ఇంటికి రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాణి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకుండాపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.