పూజారి కాలు తన్నులకు మోక్షం.. వినటానికి నమ్మశక్యంలేని ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మే జనాలు నేటి సమాజంలో ఇంకా ఉన్నారు. అయితే తాజాగా కర్నూలు జిల్లాలోని సిద్ధరామేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలోనూ ఇలాంటి నమ్మకాలే అమల్లో ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోని చిన్నహోతూరులో సిద్ధరామేశ్వరస్వామి ఆలయం ఉంది.
ఇక్కడ ప్రతీ సంవత్సరం ఏప్రిల్ మాసంలో స్వామివారికి ఘనంగా రథోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపులో భాగంగా శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. అయితే, ఈ సందర్భంగా ఆలయ పూజారి భక్తులను దీవించే విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరభద్రస్వామి స్వయంగా పూజారి రూపంలోనే వచ్చి తమను తంతాడని, తద్వారా తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతూ ఉంటారు.
ఇది కూడా చదవండి: రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయం….!
ఇక భక్తులు వరుసగా నిలబడగా, వారిని కాలితో తన్నుకుంటూ పూజారి ముందుకెళతాడు. అనంతరం ఆ భక్తులు గులాబీ రంగు నీటితో స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు. ఇలా తన్నించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు తన్నించుకోవడానికి బారులు తీరారు. ఈ తన్నుల సంప్రదాయం 500 ఏళ్లుగా కొనసాగుతోండటం విశేషం. భక్తుల నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.