సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి చీడ పురుగు బతికి ఉండటానికి వీలు లేదని.., రాజు చావుతోనే పాపకి న్యాయం జరిగిందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.., రాజు ఆత్మహత్యలో మరో కోణం ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
సింగరేణి కాలనీలో ఘటన జరిగింది ఈ నెల 9వ తేదీ. నిందితుడు రాజు ఆ రోజు రాత్రి నుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి చిన్నారి చనిపోయిన విషయం, రాజు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. కానీ.., రాజు అప్పుడు కూడా భయపడలేదు. కనీసం అతనిలో ప్రశ్చ్యాత్తాపం కూడా కనిపించలేదు. ఘటన జరిగిన పక్క రోజే తన స్నేహితుడితో కలసి ఫుల్ గా మద్యం సేవించాడు రాజు. ఇలాంటి వ్యక్తి బయపడో, బాధపడొ సైసైడ్ చేసుకున్నాడన్న వార్త అంత నమ్మబుద్ది కావడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి రాజు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఇందుకోసమే తన మేస్త్రి దగ్గర ముందుగానే డబ్బు తీసుకున్నాడు. కానీ.., పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వెళ్ళడానికి అతనికి అవకాశం లేకుండా పోయింది. 1000 మంది పోలీసులు డెబ్భై బృందాలుగా ఏర్పడి రాజుని అష్ట దిగ్బంధం చేసేశారు. దీంతో.. రాజు తెలంగాణ జిలాల్లను దాటి బయటకి వెళ్లలేకపోయాడు.
ఈ నేపధ్యంలోనే రాజు పోలీసులకి ప్రాణాలతో చిక్కాడా? తరువాతనే ఈ ఆత్మహత్య కోణం బయటకి వచ్చిందా? అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. “పోలీసులు తమ చేతికి మట్టి అంటకుండానే ఆ చిన్నారికి సరైన న్యాయం చేశారు” అని కొంతమంది, “గ్రూప్ గా ఉంటే ఎన్ కౌంటర్, సింగిల్ గా ఉంటే సూసైడ్” అని మరికొంత మంది పంచ్ డైలాగ్స్ కూడా వేస్తున్నారు. అయితే.., సోషల్ మీడియాలో వినిపించే కామెంట్స్ ఈ కామెంట్స్ కి ఎలాంటి ప్రామాణికం లేదు.
అయితే.., రాజు ముందుగా రైల్వే కీమెన్స్ కి ప్రాణాలతో కనిపించాడన్న వార్త కూడా మరిన్ని అనుమానాలకు తావు ఇస్తోంది. వీరి నుండి తప్పించుకుంటూ.. రాజు ట్రైన్ కింద పడ్డాడని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా.., రాజు చనిపోయింది ఆత్మహత్య కాదు. ఇది ప్రమాదం శాత్తు జరిగిన ఘటన. దీంతో.. ఈ విషయంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పుడు రాజు డెడ్ బాడీకి నార్మల్ పోలీస్ రూల్స్ ప్రకారం పంచనామా జరగనుంది. ఏదేమైనా.. చిన్నారిని దారుణంగా చంపిన నిందితుడు రాజు కన్నుమూయడంతో.. ఆ చిన్నారికి న్యాయం జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. రాజు ఆత్మహత్య విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.