Crime News: వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. శారీరక సుఖం కోసం కొందరు వ్యక్తులు కట్టుకున్న వాళ్లను కడతేరుస్తున్నారు. మరికొందరు అక్రమ సంబంధం పెట్టుకున్న భాగస్వాములను చంపేస్తున్నారు. తాజాగా, ఓ భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త శవాన్ని ముక్కలుగా కోసి బిర్యానీ వండుకుని తింది. ఈ సంఘటన ఇరాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇస్లాంషహర్‌కు చెందిన ఓ జంటకు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఐదేళ్ల ఓ పాప కూడా ఉంది.
అయితే, భర్త ఓ పరాయి మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య అతడితో తరచూ గొడవపడేది. గొడవ జరిగిన ప్రతీసారి భర్త ఆమెను, బిడ్డను కొట్టేవాడు. కొద్దిరోజుల క్రితం ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో భర్త కత్తి తీసుకుని వచ్చి భార్యను బెదిరించాడు. భర్తపై కోపంతో ఉన్న భార్య అతడి చేతిలోని కత్తిని లాక్కుంది. దాంతోనే అతడ్ని నరికి చంపింది.
తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసింది. వాటితో బిర్యానీ చేసుకుని తినింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో సగం కట్ చేసిన భర్త శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భర్తను తానే చంపేసినట్లు, శవంతో బిర్యానీ వండుకుని తిన్నట్లు నిందితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆస్పత్రి ఉద్యోగి గలీజ్ పని.. ఈసీజీ చేసుకోవాలంటూ గదిలోకి పిలిచి!