తల్లిదండ్రులు పిల్లలపై అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. కొన్ని సార్లు పిల్లలు తప్పు చేసినా, తోవ తప్పారని వాళ్లకు అనిపిస్తే కోపం కూడా చూపిస్తారు. పిల్లలను ఉన్నతంగా చూడాలన్నదే వారి కోపానికి కారణం. అది అర్థం చేసుకోకుండా.. కొంతమంది చిన్నారులు ఆవేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని కన్నవారికి కన్నీళ్లు మిగిలిస్తున్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే.. తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు ఒడిగట్టింది.
ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు గురువారం విడులైన విషయం తెలిసిందే. నల్గొండలోని గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి (16) అనే విద్యార్థికి ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. కూతురి మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా రోదించారు. ‘కాస్త మందలిస్తే బాగా చదువుతావని అనుకున్నవమ్మా.. ఇలా ప్రాణాలు తీసుకుంటావని అనుకోలేదు’ అంటూ బోరున విలపించారు. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నల్గొండలో దారుణం: రోడ్డుపై వెళ్తున్న మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి.. రేప్ ఆపై హత్య