పోలీసులు, ఈడీ అధికారుల సోదాల్లో కోట్ల రూపాయల నల్లదనం బయట పడటం చూస్తూనే ఉంటాం. ఎవరో బనామీలో, రాజకీయ నాయకులో, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో ఇలాంటి సీన్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అలాంటి ఆయన కాదు. కాలేజ్ పాఠాలు చెప్పుకునే ప్రొఫెసర్ మాత్రమే. కానీ, ఆయన ఇంట్లో అధికారులు రైడ్ చేయగా లక్షల్లో నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఆ ఘటన గురించి తెలుసుకుని స్థానికులు అంతా ఆశ్చర్యపోతున్నారు.
పశ్చిమ బెంగాల్ లో గత కొన్ని నెలల క్రితం ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సోదాల్లో కొట్ల రూపాయల నల్లధనం వెలుగుచూసింది. తాజాగా బరాక్ పూర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సోదాలు నిర్వహించారు. కమిషనరేట్ అధికారులు పరగణాస్ లో సోదాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఖర్దాలో నాథుపాల్ ఘాట్ రోడ్ ప్రాంతంలో అమితాబ్ అనే ప్రొఫెసర్ నివాసముంటున్నారు. ఆయన ఆ ప్రాంతంలో ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నారు. అయితే ఆయన్ని అందరూ సాధారణ పంతులు అనుకున్నారు.
పోలీసులు రైడ్ చేసే వరకు అంతా అదే భావనలో ఉన్నారు. కానీ, శుక్రవారం పోలీసులు దాడి చేసన తర్వాత అంతా నోరెళ్లబెట్టారు. పక్కా సమాచారంతో ఇంటిలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రొఫెసర్ ఫ్లాట్ లో రూ.32 లక్షలు నగదు లభ్యమైంది. అమితాబ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. రెండున్నరేళ్లుగా అదే ఫ్లాట్ లో నివాసముంటున్నారు. ఇంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై స్పష్టత రాలేదు. అడ్మిషన్లు ఇప్పిస్తూ ఈ నగదు సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెసర్ ని పోలీస్ కమిషనర్ విచారిస్తున్నారు. దర్యాప్తు తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి.