గత కొంత కాలంగా సెోబర్ నేరగాళ్లు రక రకాల పద్దతుల్లో ప్రజలను ఈజీగా మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి అప్ డేట్ చేస్తున్నామని.. పర్సనల్ లోన్స్ సెటిల్ మెంట్ చేస్తామని.. ఇలా ఎన్నో రకాలుగా ఫోన్లు చేసి ఓటీపీ రాగానే పూర్తి డేటా చోరీ చేస్తుంటారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు తెగబడిపోతున్నారు.. అమాయకులను క్షణాల్లో బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పినా.. ప్రజలు చేసే చిన్న తప్పిదాలు సైబర్ నేరగాళ్లకు ప్లస్ అవుతుంది. తాజాగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై, ఢిల్లీ, నాగపూర్ కి చెందిన ముఠా సభ్యులు.. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పూర్తి వివరాల్లోయి వెళితే..
దేశ ప్రజలకు సంబంధించిన పర్సనల్ డేటాను కొంతమంది సైబర్ నేరగాళ్లు తమ గుప్పిట్లో పెట్టున్నారని.. ప్రముఖ బ్యాంక్ లకు చెందిన కోట్ల మంది క్రెడిట్, డెబిట్ కార్డు డేటాను చోచీ చేశారని.. అందులో తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాని ఫోన్లు, మెజేజ్ లు చేస్తుంటారని.. వారి ఉచ్చులో పడితే సెకండ్స్ లో డేటా చోరీ చేస్తారని అన్నారు. ఇందులో ప్రముఖంగా మహిళలకు సంబంధించిన డేటా ఎక్కువ చోరీకి గురైందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ చేశారని.. ఫేస్ బుక్ వాడే యూజర్స్ డేటా 7 లక్షలు అని.. వారి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ సైతం చోరీ చేశారని తెపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.
ముంబై, ఢిల్లీ, నాగ్ పూర్ కేంద్రంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కోట్ల మంది పర్సనల్ డేటా చోరీకి గురైందని తెలిపారు. ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకులకు సంబంధించిన డేటా ఎక్కువగా చోరీకి గురైందని.. ఇటీవల క్రెడిట్ కార్డుల కోసం ఇక ఏజెన్సీని పెట్టుకున్నారని.. ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటాను అమ్ముకున్నట్లు వివరించారు. ఇన్స్ రెన్స్ , లోన్స్ కోసం అప్లై చేసిన 4 లక్షల మంది డేటా చోరీ చేశారని అన్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. సైబర్ నేరగాళ్లు ఏకంగా డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు సంబంధించిన పర్సనల్ డేటా కూడా అమ్మాకినికి పెట్టారు. ప్రస్తుతం డేటా చోరీ భారత దేశంలో అతిపెద్ద చోరీ అని.. దేశ భద్రతకు ముప్పు ఉందని అన్నారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. డేటా చోరీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.