మహిళలంటే అతడికి మోజు. మరీ ముఖ్యంగా కొరియా మహిళలు. నకిలీ ఉద్యోగాలతో ప్రకటనలు చేసి మహిళలు, యువతులకు వల వేసేవాడు. నమ్మి వచ్చిన వారు బతుకు బుగ్గిపాలు చేసేవాడు. అతడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రముఖుడు. మొత్తంగా 13 మందిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
మోసం చేయడంలో ఇతడు ఖండాంతరాలను దాటేశాడు. యువతులే లక్ష్యంగా నకిలీ ఉద్యోగ ప్రకటనలు చేసేవాడు. ఆ ప్రకటనలు చూసి వచ్చిన యువతులకు పానీయాల్లో నిద్ర మాత్రలు కలిపి, ఆపై అత్యాచారం చేసి, వాటిని వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూసుకుని పైశాచికత్వ ఆనందం పొందేవాడు. మరీ ముఖ్యంగా కొరియా మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇవన్నీ ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారత సంతతి వ్యక్తి ఘనకార్యం. అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కొరియా మహిళల కోసం కొరియన్ నుండి ఇంగ్లీషు ట్రాన్స్ లేషన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రత్యేక ప్రకటనలతో వల వేసేవాడు. మొత్తంగా 13 మందిపై అత్యాచారానికి ఒడి గట్టాడు ఈ కామాంధుడు.
అతడి పేరు బాలేష్ దన్ ఖర్. ఆస్ట్రేలియాలో సిడ్నీలో నివాసముంటున్న ఇతగాడికి స్థానికంగా మంచి పలుకుబడి ఉంది. ఉద్యోగాల పేరుతో నకిలీ ప్రకటనలు ఇచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2018 జనవరి- అక్టోబరు మధ్య కాలంలో ఏకంగా 13 మందిపై అత్యాచారానికి తెగబడ్డాడు. వీరిలో ఐదుగురు కొరియా మహిళలు ఉన్నారు. ఈ అత్యాచారాలకు పాల్పడిన సమయంలో అతడు సిడ్నీ ట్రైన్స్‌కు లీడ్ డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మహిళల్ని నకిలీ ఉద్యోగాల పేరిట మోసం చేసి, మత్తు మందు కలిపిన శీతల పానీయాలు తాగించి.. సెల్ ఫోన్ లేదా , అలారం క్లాక్ రూమ్ లో రహస్య కెమెరాలు ద్వారా వీడియోలు చిత్రీంచాడు. అక్టోబర్ లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అతడి బాగోతం బటయపడింది.
ఆ ఏడాది అక్టోబరులో నిందితుడు ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో పోలీసులు సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. ఆ వీడియోల్లో మహిళలు ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో అరెస్టైన అతగాడు తాను అమాయకుడినంటూ నాలుగేళ్లుగా నమ్మబలికాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన బాలేష్‌ను .. ప్రముఖ సంస్థలు ఏబీసీ మరియు ఫైజర్‌లు అతడ్ని నియమించుకోవడం గమనర్హం. ఆస్ట్ర్రేలియాలో అతడు ఓ పార్టీని కూడా స్థాపించాడు.బాలేష్ హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియాకు ప్రతినిధిగా కూడా ఉన్నారు. తన పలుకుబడితో తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడి పప్పులేమీ ఉడకలేదు. ప్రస్తుతం అతడిపై 39 కేసులు నమోదయ్యాయి.