ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంలో ఏన్నో కొత్త కొత్త ప్రయోగాలు వెలుగు చూస్తున్నాయి. కానీ మన దేశంలో జరిగే కొన్ని సంఘటనలు వైద్య రంగానికే కలంకం తెస్తున్నాయి. అంబులెన్స్ డోర్ తెరుచుకోక చనిపోడం, వైద్యుడి కోసం వేచి చూసి చూసి పసికందు తల్లి ఒడిలోనే కన్ను మూసిన దైన్యం మనం కళ్లారా చూసిందే. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీం పట్నం కుటుంబ నియంత్ర ఆపరేషన్ ల సంఘటన చాలా విచారకరమైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
తమకు ఇద్దరు పిల్లలు చాలు.. అని ఆ దంపతులు కు.ని ఆపరేషన్ చేయించుకుందానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అదే వారికి చివరి తమ పిల్లలను చూసుకునే చివరి చూపు అవుతుందనుకోలేదు. తల్లి వస్తుందని ఇంటి దగ్గరే ఎదురు చూస్తున్న పిల్లలకి ఏం సమాధానం చెప్పాలో తెలిక కన్న తండ్రి పడే బాధ వర్ణణాతీతం. కు.ని ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించారు.
ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు అదేశించింది. అదే విధంగా చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు డబుల్ బెడ్ రూపం ఇల్లు ఇస్తామని డీహెచ్ శ్రీనివాస రావు ప్రకటించారు. మరి ఈ విషాదకరమైన సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.