మత్తు పదార్ధాలు యువతని పెడదోవ పట్టిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరు, ముంబై వంటి మహా నగరాల్లో ఎక్కువగా ఇలాంటి మత్తు పదార్ధాలకి పిల్లలు బానిసలై పోతున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో దీన్ని నిరూపించే విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ బొడుప్పల్ లోని ఓ పాన్ షాప్ లో మత్తు పదార్ధాల కోసం యువకులు హంగామా చేశారు. OCB ప్రీమియం పేపర్ కొనేందుకు వారు షాపుకు వచ్చారు. అయితే.., తమ షాపులో అలాంటి పేపర్ దొరకదని యాజమాని సమాధానం ఇచ్చారు. దీంతో పేపర్ లేకపోతే షాప్ ఎందుకు తెరిచావ్…? క్లోజ్ చేయ్ అంటూ యువకులు నానా రచ్చ చేశారు. షాప్ ఫ్లెక్సీలు సైతం చింపేశారు.
OCB ప్రీమియం పేపర్ ను మత్తు పదార్థంగా వాడతారు. దీని అమ్మకంపై ఇప్పటికే పలు రాష్ట్రలలో ఆంక్షలు కూడా ఉన్నాయి. కానీ.., యువకులు మాత్రం షాప్ ఓనర్ మాటలను పట్టించుకోలేదు. OCB ప్రీమియం పేపర్ తమకి ఇవ్వడం లేదని ఓ పెద్ద గ్రనేట్ రాయితో యాజమానిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ దృశ్యాలు అన్నీ సీసీటీవీలో రికార్డ్ ఆయాయ్యి. షాప్ ఓనర్ మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేయడంతో.. పోలీసులు యువకులని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.