ఐపీఎల్ ఎఫెక్ట్ అంటూ కొందరు బెట్టింగ్ లో పడి సొంత ఆస్తులు సైతం కరిగేదాక పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఐపీఎల్ మోజులో పడ్డ ఓ బ్యాంక్ ఉద్యోగి ఏకంగా బ్యాంక్ నే లూటీ చేశాడు. సుమారుగా రూ. 22 లక్షల 53వేలతో ఉద్యోగి పరారయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్ వనస్థలీపురంలో ప్రవీణ్ అనే వ్యక్తి ఓ బ్యాంకులో క్యాషియర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అయితే ఇది ఐపీఎల్ సీజన్ కావడంతో ప్రవీణ్ జోరుగా బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. ఇక బెట్టింగ్ లో పడి ప్రవీణ్ పూర్తిగా నష్టపోవడంతో పని చేస్తున్న బ్యాంక్ కే కన్నం వేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే రెండ్రోజుల కిత్రం ప్రవీణ్ బ్యాంకులో 22 లక్షల 53వేలు తీసుకుని కనిపించకుండా పరారయ్యాడు. దీంతో అనుమానమొచ్చిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: Nalgonda: తాను చనిపోతూ.. ఐదుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!
అయితే ప్రవీణ్ బెట్టింగ్‌లో వచ్చేస్తే తిరిగిస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్యాంకు ఉద్యోగులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానని బ్యాంక్ మేనేజర్‌కి ప్రవీణ్ మెసేజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతోప్రవీణ్ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసి ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.