ఓ యువకుడు తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కొడుకు తండ్రిని ఎందుకు దారుణంగా కొట్టి చంపాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి?
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తండ్రిని ఎందుకు దారుణంగా కొట్టి చంపాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ రామంతపూర్ డివిజన్ పరిధిలోని వివేక్ నగర్ ప్రాంతం. ఇక్కడే సంద్యాల పాండు సాగర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతను స్థానికంగా టెంట్ హౌస్ ను నడిపిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే పాండు సాగర్ నాలుగేళ్ల కిందట ఫిర్జాదిగూడకు చెందిన ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అతను తన మొదటి భార్య, కుమారులను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే వీరి కుటుంబంలో తరుచు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అతని టెంట్ ను హౌస్ ను అతని పెద్ద కుమారుడు నిర్వహిస్తున్నాడు.
అయితే ఇటీవల రామంతపూర్ లో ఉన్న తండ్రి పాండు సాగర్ వద్దకు అతని కుమారుడు పవన్ సాగర్ (30) వచ్చాడు. డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన కొడుకు పవన్.. సుత్తితో తండ్రిపై దాడి చేశాడు. కుమారుడి దాడిలో తండ్రి పాండు సాగర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.