హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదు టీసీ ఇవ్వమంటూ వేధించడంతో మనస్థాపం చెందిన విద్యార్థి నారాయణ స్వామి.. ప్రిన్సిపాల్ గదిలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాక గదిలో తనతో పాటు ఉన్న ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్‌రెడ్డిని పట్టుకోవడంతో.. వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరందరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, అశోక్ రెడ్డిలు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థి నారాయణ స్వామి ఆరోపించాడు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.