Hyderabad: నగరంలోని హైటెక్ సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతూ ఓ ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద రాజప్ప, శ్రీను, కృష్ణలు రైలు పట్టాలు దాటుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కన రైలు వస్తోందన్న సంగతి కూడా వారు గుర్తించలేదు. దీంతో ఎంఎంటీఎస్ రైలు వారిని ఢీకొట్టింది.
ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరి దగ్గర మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను వనపర్తికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ముగ్గురు సంకల్ప్ అపార్ట్‌మెంట్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భర్త ఫ్రెండ్స్ తో భార్య చీకటి కాపురం.. ఇద్దరూ ఒకేసారి ఇంటికి రావడంతో..!