నేటి కాలం యువత చదువుకోవాల్సిన వయసులోప్రేమా, గీమా అంటూ చెడు మార్గాల్లో పయనిస్తున్నారు. ఇంకొందరైతే వావివరసలు మరిచి బరితెగించి ప్రేమ పేరుతో జులాయిగా తిరుగుతున్నారు. ఇక వీరి పెళ్లికి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో చివరికి ఎదురించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ లో వరుసకు అన్నాచెల్లెళ్లు అయ్యే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి శారీరకంగా కలుసుకున్నారు. ఇక కొంత కాలానికి ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు భయపడి ఏం చేయాలో అర్థం చిక్కుల్లో పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ లోని ఓ ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే వీరి ఇంటి సమీపంలోనే వరుసకు అన్న అయ్యే ఓ 16 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. అయితే ఆ బాలుడు తరుచు ఆ అమ్మాయి ఇంటికి వస్తుండేవాడు. వరుసకు సోదరుడు కావడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కూడా అనుమానించలేదు. ఎంతో సన్నిహితంగా ఉన్న ఈ అన్నా చెల్లెళ్లు చివరికి ప్రేమలో పడ్డారు. అలా కొంత కాలం పాటు ఇరువురి తల్లిదండ్రులకు తెలియకుండా వీరి ప్రేమాయణాన్ని కొనసాగించారు. వీళ్లు ఇంతటితో ఆగక అప్పుడప్పుడు శారీరకంగా కూడా కలుసుకున్నారు.
అయితే గత రెండు నెలల నుంచి ఆ బాలికకు నెలసరి రావడం పూర్తిగా ఆగిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాని ఆ బాలిక.., డాక్టర్ ను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడికి భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఈ నెల 22న వీళ్లిద్దరూ కలిసి బీహార్ నుంచి రైలెక్కి సికింద్రాబాద్ కు స్టేషన్ కు చేరుకున్నారు. వీరిద్దరు కాస్త అనుమానంగా కనిపించడంతో దివ్యదిశ చైల్డ్ లైన్ ప్రతినిధులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వీరి ఇరువురిని ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టారు. వెంటనే ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులు బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును బీహార్ కు బదిలీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమవుతోంది.