వాళ్లిద్దరికి 9 నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల కొత్త సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అయితే భార్యపై ఉన్న ప్రేమతో భర్త అడిగిందల్లా కాదనకుండా కొనిస్తున్నాడు. ఇటీవల భార్య సినిమాళ్దామని కోరింది. భార్య మాటను కాదనని భర్త సరేనంటూ భార్యతోను సినిమాకు తీసుకెళ్లాడు. గంటపాటు ఈ దంపతులు ఎంజాయ్ చేస్తూ సినిమాను చూస్తున్నారు. ఇలా ఇద్దరు సినిమా చూస్తున్న క్రమంలోనే భార్య భర్తకు కోలుకోలేని షాకిచ్చింది. ఈ దెబ్బతో భర్త నెత్తి, నోరు బాదుకున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు భార్య భర్తకిచ్చిన షాక్ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి శైలజ దంపతులు. 6 నెలల కిందటే వీరికి వివాహం జరిగింది. అయితే భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండడంతో పెళ్లైన నెల తర్వాత భార్యతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడు. ఈ నెల 21న భార్య సినిమాకెళ్దామని కోరడంతో భర్త కాదనలేకపోయాడు. ప్రేమతో అడిగింది కదా అని భర్త సరేనంటూ భార్యతో కలిసి సినిమాకెళ్లాడు. గంటపాటు ఇద్దరూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఆ తర్వాత భార్య శైలజ వాష్ రూమ్ కు వెళ్లొస్తానని భర్తకు చెప్పి వెళ్లింది.
చాలా సమయం దాటినా భార్య ఇంకా రాలేదు. దీంతో ఖంగారుపడ్డ భర్త థియేటర్ లోని మహిళా సిబ్బందితో కలిసి అన్ని వాష్ రూముల్లో వెతికాడు. కానీ శైలజ ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో బయట కూడా వెతికాడు, అయినా ఫలితం లేదు. భార్యకు ఫోన్ చేద్దామంటే తన వద్ద ఫోన్ కూడా లేదు. ఇక భర్తకు ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. నా భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. భార్య ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో భర్త నెత్తి, నోరు బాదుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.