నీ పిల్లలను నువ్వు తీసుకుపో, నా కోసం వెతకొద్దు. నా బతుకు నేను బతకగలను అంటూ ఓ మాజీ భార్య భర్తకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి పరారైంది. తాజాగా హైద్రాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహడీషరీఫ్ పరిధిలోని ఓ ప్రాంతంలో అయూబ్ గులాబ్, ఆఫ్రిన్ బేగం దంపతులు నివాసం ఉన్నారు. వీరికి పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇక కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు.
కానీ కొన్నాళ్ల తర్వాత ఈ దంపతుల సంసారంలో గొడవలు చెలరేగాయి. భార్య అందంగా ఉందని భర్త భార్యను తరుచు అనుమానించినట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా భర్త భార్య ఫోన్ చెక్ చేయడం, అనుమానంచడం వంటివి చేస్తుండేవాడు. దీంతో భర్త టార్చర్ ను భరించిన భార్య కొన్నాళ్ల తర్వాత భరించలేకపోయింది. ఇక భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య చివరికి బంధువుల సమక్షంలో గతేడాది విడాకులు తీసుకుంది. దీంతో అప్పటి నుంచి ఆఫ్రిన్ బేగం తన ముగ్గురు పిల్లలతో పాటు నివాసం ఉంటుంది. దీంతో మాజీ భర్త అయూబ్ గులాబ్ తన మాజీ భార్యకు నెల నెల భరణం చెల్లిస్తూ ఉండేవాడు.
అయితే అప్పటి వరకు ఎలాంటి చెడు తప్పులు చేయిని ఆఫ్రిన్ బేగం ఇక ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న ఆఫ్రిన్ బేగం మాజీ భర్తకు ఫోన్ చేసి.. నీ పిల్లలను నువ్వు తీసుకుపో, నా కోసం వెతకొద్దు, నా బతుకు నేను బతకగలనంటూ భర్తకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి పరారైంది. ఈ విషయం తెలుసుకున్న ఆఫ్రిన్ బేగం తల్లి కూతురి జాడ కోసం అంతటా వెతికింది. ఫలితం లేకపోవడంతో, చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.