ఈ మధ్యకాలంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సెలబ్రెటిల నుంచి సామాన్య వ్యక్తుల వరకు అలా అందర్నీ నమ్మించి కొందరు సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూ చివరికి లక్షలు గుంజుతున్నారు. సరిగ్గా ఇలాగే కొందరు సైబర్ నేరగాళ్లు పెళ్లికాని యువకులను టార్గెట్ గా చేసుకుని కొన్ని నకిలీ మ్యాట్రిమోనీల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇక అందమైన అమ్మయిలను అద్దెకు తీసుకుని వారి ఫొటోలను మ్యాట్రిమోనీ సైట్ లో పెట్టి యువకులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆ ఆగక ఆ నకిలీ మ్యాట్రిమోనీ నిర్వాహకులు యువకుల నుంచి అందినకాడికి సొమ్మును లాగేస్తూ చివరికి మోసానికి పాల్పడుతున్నారు. ఇక ఇదేంటని బాధితులు తిరిగి ప్రశ్నించగా.. ఎదురు తిరిగితే మీపై అమ్మాయిలరను లైంగికంగా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే హైదారాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మారిన పరిస్థితుల నేపథ్యంలోనే చాలా మంది చదువుకున్న యువకులు పెళ్లి సంబంధాల కోసం ఎక్కువగా మ్యాట్రిమోనీ సైట్ లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అమాయక పెళ్లికాని యువకులు, విడాకులు తీసుకుని మరో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యువకులను టార్గెట్ గా చేసుకుంటున్నారు. దీంతో ఓ నకిలీ మ్యాట్రిమోనీ సైట్ ను రూపొందిస్తున్నారు. అనంతరం కొంతమంది అమ్మాయిలను అద్దెకు తీసుకుని వారి ఫొటోలను మ్యాట్రిమోనీ సైట్ లో ఉంచుతున్నారు. దీంతో పెళ్లికాని యువకులు ఆ అందమైన అమ్మాయిల ఫొటోలు చూసి కక్కుర్తిపడి మ్యాట్రిమోనీ నిర్వహకులను సంప్రదిస్తున్నారు. దీంతో వెంటనే ఆ నకిలీ మ్యాట్రిమోనీ నిర్వాహకులు.. ఆ యువకుల పూర్తి వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత వారితో మాట్లాడి ఆ అమ్మాయిల ఫొన్ నెంబర్లు వారికి ఇచ్చి ఆ అమ్మాయితో ఓ సారి ప్రత్యేకంగా కలిసి పరిచయం చేస్తారు.
దీంతో మురిసిపోయిన ఆ యువకులు అప్పటి నుంచి ఆ అమ్మాయిలతో చాటింగ్, వీడియో కాల్ వంటివి చేస్తారు. అలా రెండు రోజులు గడిచే నాటికి మ్యాట్రిమోనీ నిర్వాహకులు.. ఆ అమ్మాయికి బహుమతులు, పాకెట్ మనీ ఇవ్వాలంటూ ఆ యువకుల నుంచి లక్షలు లక్షలు గుంజుతారు. అలా కొంత కాలం తర్వాత ఆ నకిలీ మ్యాట్రిమోనీ నిర్వాహకులు.. మీ అభిరుచులు, ప్రవర్తన, అమ్మాయికి నచ్చకపోవడంతో పాటు వారి ఇంట్లో ఒప్పుకోకపోవడం లేదంటూ వంటి సాకులు చెబుతారు. దీంతో ఆ ఆ యువకులు షాక్ తిని.. మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ ప్రశ్నించడంతో.. మీరు ఆ అమ్మాయిని లైంగికంగా వేధించారని పోలీసులకు ఒక్క ఫోన్ కొడితే చాలు మీ పని అయిపోయినట్టే అంటూ ఆ యువకులను బెదిరిస్తారు.
దీంతో నిజమేనని నమ్మని ఆ బాధితులకు ఏం చేయాలో అర్థం కాక అలాగే సైలెంట్ గా ఉండిపోయి నిండా మోసపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసింది. అమెరికాలో సివిల్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఇటీవల ఓ మ్యాట్రిమోనీ సైట్ ను ఆశ్రయించి ఓ మహిళతో టచ్ లో ఉన్నాడు. దీంతో ఆ మహిళ అడిగిన డబ్బులు, బహుమతులు పంపిస్తూ వస్తున్నాడు. అయితే పంపించిన బహుమతులు ఢిల్లీ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల వద్ద ఉన్నాయని, పన్నుల పేరుతో రూ.18 లక్షలు వరకు కాజేశాడు. దీనిపై స్పందించిన ఆ బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి విచారించగా.. ఆ దుండుగులు ఇలా ఎంతో మంది అమ్మాయిలను అద్దెకు తీసుకుని చాలా మందియువకులను మోసం చేసినట్లుగా తేలింది.