ఆమెకు ప్రభుత్వం సాధించాలనే కోరిక బలంగా ఉండేది. ఎప్పటికైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని బలంగా నమ్మింది. అందుకోసం పుస్తకాలతో కుస్తి పట్టి కష్టపడి చదివింది. కట్ చేస్తే.. హాస్టల్ గదిలో ఎవరూ లేని టైమ్ చూసి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు రత్నకుమారి. వయసు 24 ఏళ్లు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేది. అందుకోసం ఎంతో కష్టపడి చదివింది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి కన్నవారికి మంచి పేరు తీసుకురావాలని అనుకునేది. ఇందులో భాగంగానే ఆ యువతి 6 నెలల కిందట కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ కు వచ్చింది. నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటూ పక్కనే హాస్టల్ లో నివాసం ఉండేది. అయితే ఇటీవల ఆ యువతి హాస్టల్ గదిలో ఎవరూ లేని టైమ్ లో ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తత్తునగర్ గ్రామం. ఇక్కడే రత్న కుమారి (24) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. స్థానికంగా డిగ్రీ వరకు చదువుకుంది. ఇక ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఆమెకు బలంగా ఉండేది. ఇందుకోసం ఎన్నో పోటీ పరీక్షలు రాస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే.. రత్నకుమారి గ్రూప్-2 కోచింగ్ తీసుకోవడానికి 6 నెలల కిందట హైదరాబాద్ వచ్చింది. అశోక్ నగర్ లో ఓ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటూ ఓ హాస్టల్ లో నివాసం ఉండేది. ఇక రోజూ ఇనిస్టిట్యూట్ కు వెళ్లి తిరిగి హాస్టల్ కు వచ్చి చదువుకునేది. ఇదిలా ఉంటే.. సోమవారం రత్నకుమారి ఎప్పటిలాగే ఇనిస్టిట్యూట్ కు వెళ్లి తిరిగి హాస్టల్ కు వచ్చింది.
తాను ఉండే గదిలో ఎవరూ లేని టైమ్ చూసి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన తోటి స్నేహితులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆమె అప్పటికే మరణించింది. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలిపారు. తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. కూతురిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె తోటి స్నేహితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం.. 6 నెలల కిందటే యువతికి అపండెక్స్ ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి బాగా డిప్రెషన్ కు గురైంది. దీని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు.