ఈ మధ్యకాలంలో కొందరు యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ప్రేమ పేరుతో లోబరుచుకుని సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా మాయమాటలు చెప్పి శారీరక కోరికలు తీర్చుకుంటున్నారు. తీరా పెళ్లి చేసుకోమంటే ప్రియురాలికి తెలియకుండా మరో పెళ్లికి సిద్దమవుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియురాలు ప్రియుడి చేతిలో పూర్తిగా మోసపోయిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..అది హైదరాబాద్ రామాంతాపూర్ పరిధిలోని వెంకట్‌రెడ్డి నగర్ ప్రాంతం. శ్రీకాంతచారి అనే యువకుడు రామాంతాపూర్‌కి చెందిన లక్ష్మీ అనే యువతిని ప్రేమించాడు. శ్రీకాంతచారి ప్రేమకు లక్ష్మీ కూడా కొన్నాళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇద్దరు ప్రేమలో మునిగితేలుతూ తెగ ఎంజాయ్ చేశారు. వీరి ప్రేమ అలా సుమారు 12ఏళ్లుగా సాగింది.
ఇది కూడా చదవండి: Uttarakhand: కోడలు తప్పుడు కేసు పెట్టిందని.. ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి!
ఈ ఇన్నేళ్ల వీరి ప్రేమ ప్రయాణంలో ప్రియుడు ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చేయాల్సినవి అన్ని చేసేశాడు. ఇదిగాక శారీరకంగా దగ్గరవడంతో అందరూ శ్రీకాంతచారి లక్ష్మీనే వివాహం చేసుకుంటాడని నమ్మారు. ఈ క్రమంలోనే శ్రీకాంతచారి ఉన్నట్టుండి సడెన్ గా ప్రేమించిన అమ్మాయికి షాక్ ఇచ్చాడు. ప్రియురాలిని కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రియురాలికి తెలియకుండా శ్రీకాంతచారి గుట్టుచప్పుడు కాకుండా వేరే యువతి మెడలో తాళి కట్టి ఆమెతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ఇదే విషయం చివరికి తను ప్రేమించిన యువతికి తెలిసిపోయింది.
తీవ్ర మనస్థాపానికి గురైన ప్రియురాలు తమ బంధువుల సాయంతో శ్రీకాంతచారి ఇంటి ముందు భైటాయించి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, అతనితోనే నాకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది. ఇక మరో విషయం ఏంటంటే? దళితురాలు అనే ఉద్దేశంతోనే ప్రియుడు నన్ను మోసం చేశారని ప్రియురాలు వాపోయింది. బాధితురాలి నిరసనకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాల నేతలు సైతం శ్రీకాంతచారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.