దేశంలో మహిళలపై దాడులు, హింస, సామూహిక ఆత్యాచారాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నా యి. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా మహిళలకు ఒరిగిందేమిలేదు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయే తప్ప.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నది నిజం. తాజాగా ఇలాంటి కోవకు చెందిన మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. కామాంధుడిగా మారిన ర్యాపిడో డ్రైవర్.. కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
నగరానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి.. ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పగటి వేల ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్న విజయ్ కుమార్.. రాత్రి వేల అమ్మాయిలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. తనకు తెలిసిన వారి నుంచి కాలేజీ అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించిన ఇతడు.. అమ్మాయిలకు నగ్న ఫోటోలు పంపేవాడు. అగంతకుడి చిత్రహింసలతో విసిగిపోయిన బాధిత యువతులు షీటీమ్స్ ను ఆశ్రయించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పిర్యాదులు అమ్మాయిల నుంచి ఎక్కువవడంతో.. దీనిపై షీటీమ్స్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. టెక్నాలజీ సాయంతో.. ఈ ఘాతుకానికి పాల్పడింది విజయ్ కుమార్ అని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామవాంఛతో ఇలా ఆడపిల్లల్ని వేధిస్తున్నట్టు విజయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jubilee Hills: వీడియో వైరల్: భార్య అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!