సంతోషంగా సాగాల్సిన వైవాహిక జీవితాలు వివాహేతర సంబంధాల కారణంగా ఎటు కాకుండా పోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఎవరికి వారు ఇష్టమొచ్చిన రీతిలో చీకటి కాపురాల్లో వేలు పెట్టి సొంత పరువును బజారు కీడ్చుకుంటున్నారు. ఇక ఇలాంటి ఘటనలోనే ప్రియుడితో బెడ్ రూంలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడో భర్త. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..రహమత్‌నగర్‌లో ఓ భార్యాభర్తలు ప్రేమ వివాహం చేసకుని ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే భర్త ఆర్మీ జవాన్ కావడంతో భార్య ఇంట్లో ఒంటరిగానే ఉండేది. ఇక కొంత కాలం పాటు వీరి వైవాహిక జీవితం బాగానే గడిచింది. కానీ కొన్నాళ్ల నుంచి ఆర్మీ జవాన్ భార్య భర్తను కాదని పరాయివాడి ప్రేమలో పడింది.
ఇది కూడా చదవండి: Krishna District: ఒకే అమ్మాయిపై మనసుపడ్డ ఇద్దరు యువకులు.. ఇద్దరిలో ఒకరే ఉండాలంటూ!
దీంతో ఆ మహిళ భర్తలేని సమయంలో ప్రియుడిని ఏకంగా ఇంటికి పిలిపించుకుని కోరికలు తీర్చుకునేది. అలా కొంత కాలం భర్తకు తెలియకుండా చీకటి కాపురాన్ని బాగానే దిద్దుకుంటూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి భర్త ఓ రోజు సడెన్ గా ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్యతో పాటు ఆమె ప్రియుడిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీంతో వెంటనే వారున్న గదికి తాళం వేసి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు.
హుటాహుటిన చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నా భార్య మోసం చేసిందంటూ ఆమె భర్త తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఎంతో మంది పెళ్లైన మహిళలు పరాయి వాడికి జైకొట్టి కట్టుకున్న భర్తను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.