హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో ఎన్నో రకాల పాడు పనులకు తెర లేపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించుకుని గలీజ్ దందాను నడిపిస్తున్నారు. అచ్చం ఇలాగే కొందరు వ్యక్తులు.. మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించి వారిపై కేసులు నమోదు చేసి ఆ సెంటర్ ను సీజ్ చేశారు.
హైదరాబాద్ ను వేదికగా చేసుకుని కొంతమంది వ్యక్తులు పాడు పనులకు తెర లేపుతున్నారు. ఏకంగా వయసుకు వచ్చిన అమ్మాయిలు, పెళ్లైన అందమైన మహిళలతో ఈ గలీజ్ దందాకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి ఘటనలు నగరంలో చాలా చోట్ల వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కొందరు నిర్వాహకులు మసాజ్ ముసుగులో పాడు పనులు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం పోలీసులు కొందరు నిర్వాహకులను అరెస్ట్ చేసి ఆ సెంటర్ ను సీజ్ చేశారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ప్రకాష్ అనే వ్యక్తి ఓ ఫ్యామిలీ సెలూన్ ను నిర్వహిస్తున్నాడు. ఇతడు మసాజ్ పేరుతో క్రాస్ మసాజ్ చేస్తున్నట్లుగా సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి అందమైన యువతులను రప్పించి మసాజ్ ముసుగులో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా ఎలాంటి లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్దంగా ఈ మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు అందులో సీసీ కెమెరాలు లేకపోవడం విశేషం. ఇక మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే మసాజ్ సెంటర్ ను సీజ్ చేశారు. అంతేకాకుండా ఆ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై సైతం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.