హైదరాబాద్ సైదాబాద్ లో నివాసం ఉంటున్న ఓ యువతి గతంలో ఓ యువకుడిని ప్రేమించింది. కొంత కాలం వీరిద్దరు కలిసి తిరిగి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. కట్ చేస్తే ఉన్నట్టుండి ఏదో కారణంతో ఇద్దరు విడిపోయారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ యువతి ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తుండగా ఓ యువకుడిని నుంచి మెసెజ్ వచ్చింది. అతను నా మాజీ ప్రియుడే అనుకుని యువతి ఉబ్బితుబ్బిపోయింది. తిరిగి అతనితో చాటింగ్ కూడా చేసింది.
ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. అతని కోరిక మేరకు నగ్న చిత్రాలు కూడా పంపింది. అయితే ఓ రోజు ఇద్దరు ముఖాముఖిగా కలుసుకోవాలనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే ఇద్దరూ ఓ చోట కలుసుకున్నారు. ఆ యువకుడిని చూసి ఆ యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన నగ్న చిత్రాలు పంపింది మాజీ ప్రియుడికి కాదని తెలుసుకుంది. దీంతో ఆ యువతి నా నగ్న చిత్రాలు తొలగించాలని వేడుకుంది. దీనికి స్పందించిన ఆ యువకుడు నాకు డబ్బులు ఇచ్చేంత వరకూ డిలీట్ చేసేది లేదంటూ తెగేసి చెప్పాడు. లేకుంటే అందరికీ పంపుతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు.
ఇది కూడా చదవండి: Karnataka: చనిపోయిన కూతురితో నాలుగు రోజులు గడిపిన తల్లి! ఎందుకో తెలుసా?
దీంతో వెంటనే ఆ యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడు హైదరాబాద్ శివారులోని శివరాంపల్లికి చెందిన మహ్మద్ మొహ్సిన్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.