హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్తే చివరికి భార్యను దారుణంగా హత్య చేసి చివరికి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పంజాగుట్టలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) ఇద్దరు భార్యాభర్తలు. అస్సాం రాష్ట్రానికి చెందిన వీరికి గతంలో పెళ్లై ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రేమ్ నగర్ లో కాపురం పెట్టారు. అయితే భర్త జీవీకే మాల్ లో సెక్యూరిటీగా పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగుతూ వచ్చింది.
భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపురాన్ని నెట్టుకొచ్చారు. అయితే ఈ మధ్యకాలంలోనే భార్యాభర్తల సంసారంలోకి వివాదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు మాటలు దాడి కూడా చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక సోమవారం వారిద్దరి మధ్య మరోసారి గొడవ తలెత్తింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యను నీటి బకెట్ ముంచి హత్య చేశాడు. ఇక అనంతరం భార్య శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి రైల్వే స్టేషన్ ను చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బిశ్వాస్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
ఇది కూడా చదవండి: Rajasthan: అల్లుడిపై మనసుపడ్డ పిల్లనిచ్చిన అత్త! చివరికి ఊహించని విషాదం!
వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసుకున్నాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వీరి హత్యకు వివాహేతర సంబంధం ఉందా? లేదంటే భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగానే భర్త ఇంతటి దారుణానికి పాల్పడ్డా అనే పూర్తి విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.