తండ్రి అంటే ఓ ధైర్యం. తండ్రి అంటే ఓ భరోసా. అలాంటి తండ్రికి, కూతురికి మధ్య ఉండే అనుబంధం ఎంతో మధురమైనది. ఇలా ఎంతో ధైర్యాన్ని ఇస్తూ కూతురికి జీవితానికి మంచి భవిష్యత్ ను ఇవ్వాల్సిన కొందరు తండ్రులు మృగాలుగా మారి దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ తండ్రి కిరాతకంగా మారి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో నిందితులకు కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో మహమ్మద్ జహంగీర్ అనే 35 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.
కొన్ని రోజుల తర్వాత ఈ దంపతులు ఇద్దరు హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మొదటి భర్తకు జన్మించిన 13 ఏళ్ల కుమార్తె ఉంది. తన కూతురితో పాటు ఆ మహిళ జహంగీర్ తో ఉంటుంది. అయితే మహమ్మద్ జహంగీర్ హైదరాబాద్‌కు వచ్చి బర్కత్ పురలోనే ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. దీంతో భార్య కూడా చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో పాచి పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఈ దంపతులిద్దరూ కొంత కాలం మంచిగానే కాపురం చేశారు.
ఇది కూడా చదవండి: తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికూతురు! పోలీసులకే సవాలు!
కానీ రోజులు మారుతున్న కొద్ది భర్త జహంగీర్ బుద్ది మాత్రం వక్రమార్గంలోకి వెళ్లి తన 13 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. 2017లో ఓ రోజు మహమ్మద్ జహంగీర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగకుండా వరసకు తమ్ముడు అయ్యే మహమ్మద్ భాషా అనే 32 ఏళ్ల వ్యక్తిని కూడా రప్పించుకుని అతనితో కూడా అత్యాచారం చేయించాడు. 2017లో ఆ బాలిక అత్యాచారానికి గురైందన్న విషయాన్ని స్కూలులో టీచర్ పసిగట్టింది.
దీంతో ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును విచారించిన పదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత మంగళవారం మహమ్మద్ జహంగీర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో పాటు ఆమెకు రూ.5 వేల జరిమానా, అతని సోదరుడు మహమ్మద్ భాషాకు మూడేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ను వెలువరించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.