హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కీలేడీలు ఇద్దరు వృద్ధులను టార్గెట్ చేసుకుని వారితో చనువు పెంచుకున్నారు. ఆ తర్వాత వారికి న్యూడ్ వీడియో కాల్స్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
రోజు రోజుకు సాంకేతిక యుగం కొత్త పుంతలు తొక్కుతోంది. మారిన టెక్నాలజీ యుగంతో లాభాలతో పాటు నష్టాలు కూడా పొంచి ఉన్నాయి. అతి తెలివిని ఉపయోగిస్తూ కొందరు అమాయక జనాలను మోసం చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన కొందరు కీలేడీలు.. వృద్ధులను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక చేయాల్సింది అంతా చేసి చివరికి అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. చేసేదేం లేక నెత్తి, నోరు బాదుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగింది తెలిస్తే నోళ్లు తెరవాల్సిందే.
కొందరు సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ లోని కొందరు వృద్ధులను టార్గెట్ చేసుకున్నారు. మెల్లగా ఎలాగో వారి మొబైల్ నెంబర్ ను రాబట్టారు. ఆ తర్వాత తెలిసిన వ్యక్తుల్లా వారితో చాటింగ్ చేస్తూ నమ్మించారు. బంధువులేమోనని వాళ్లు కూడా వారితో చాటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆ కీలేడీలు బాగా నమ్మించి వారితో చనువు పెంచుకున్నారు. ఆ తర్వాత వారికి న్యూడ్ గా వీడియో కాల్స్ చేశారు. ఇదంతా ఆ వృద్ధులు చూస్తూ, మాట్లాడుతుండగా రికార్డ్ చేసుకున్నారు. ఇక అదే వీడియోలను వారికి సెండ్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగారు. ఆ వీడియోలతో బెదిరించి కొన్ని దఫాలుగా ఏకంగా రూ.23 లక్షల వరకు కాజేసినట్లు తెలుస్తుంది. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతుంది.