పైన కనిపిస్తున్న ఓ యువతి పేరు శ్రావ్య, మరో అమ్మాయి పేరు అంకిత. వీళ్లిద్దరూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఉన్నట్టుండి కనిపించకుండాపోయారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో గత కొంత కాలం నుంచి ఇటు స్కూల్ పిల్లలు, అటు కాలేజీ విద్యార్థుల అదృష్టమవుతున్నారు. ఈ మధ్యకాలంలో మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన మరో ఇద్దరు యువతులు కనిపించకుండాపోయారు. కుటుంబ సభ్యులు బంధులకు ఫోన్ చేసి వీరి సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ, ఎక్కడా కూడా వీరి ఆచూకి లభించలేదు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాత్మాగాంధీ నగర్ బస్తీలో అంకిత (19) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి స్థానికంగా ఉన్న ఓ డెంటల్ ఆస్పత్రిలో పనికి కుదిరింది. ఇక ఎప్పటిలాగే ఆ యువతి ఆదివారం కూడా డ్యూటికి వెళ్లింది. కానీ, సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడి అటు ఇటు వెతికారు. ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఇక చేసేదేం లేక ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు.
నల్లకుంటలో యువతి మిస్సింగ్:
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లికి చెందిన శ్రావ్య (19) అనే యువతికి ఇటీవలె వివాహం జరిగింది. అయితే, ఈ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. చదువు నిమిత్తం శ్రావ్య నగరంలోని నల్లకుంటలో ఓ ప్రైవేట్ హాస్టల్ ఉంటూ చదువుకుంటుంది. ఇకపోతే, ఈ నెల 17న శ్రావ్యను చూడటానికి ఆమె తండ్రి హాస్టల్ కు వచ్చాడు. కానీ, ఆ యువతి హాస్టల్ లో కనిపించలేదు. హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించగా.. ఈ నెల 16న హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని, మళ్లీ తిరిగి రాలేదని చెప్పారు. ఆమె తండ్రి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఎక్కడా కూడా ఆ యువతి ఆచూకి లభించలేదు. ఇక చేసేదేం లేక శ్రావ్య తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.