నేటి కాలంలోని యువత ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ కులాంతర వివాహాలు చేసుకునే క్రమంలో వారి తల్లిదండ్రులు పెళ్లికి నో చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులను ఎదురించి కొందరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటుండంతో యువతి తల్లిదండ్రులు పరువు పేరుతో ప్రియుడిని దారుణంగా హత్య చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఇలా ఓ యువతిని ఇష్టపడ్డ యువకుడు ముందుగా ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చేరవేశాడు. కులాలు వేరు కావడంతో ఈ పెళ్లికి ప్రియురాలి కుటుంబం అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు నారుకట్ల రమేష్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి. ఇదే గ్రామానికి చెందిన రమేష్ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం గచ్చిబోలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Warangal: సెలవు.. ఇక ఎప్పటికీ దొరకను! కంటతడి పెట్టిస్తున్న చిన్నారి మరణం!
అయితే రమేష్ చదువునే రోజుల్లో ఓ యువతిని ప్రేమించాడు. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమ విహారంలో తెలియాడారు. ఇక యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఇంట్లో తన ప్రేమ విషయాన్ని తెలిపింది. దీంతో కూతురు మరో కులస్తుడిని ప్రేమించిందని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు ఒంటికాలిపై లేచి యువతిని మందలించి పెళ్లికి ఒప్పుకునేది లేదంటూ తేల్చి చెప్పారు. ఇదే విషయం ప్రియుడు రమేష్ కు తెలిసింది. తాను ప్రేమించిన యువతి దక్కదనుకుని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనలో తాను కుమిలిపోయాడు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇందులో భాగంగానే గురువారం ఘట్కేసర్–చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్ కిందపడి రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇక అనంతరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.