ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ప్రపంచాన్ని మరిచి ప్రేమ సాగరంలో మునిగితేలారు. అయితే ఈ క్రమంలోనే ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక రోజులు గడిచే కొద్ది వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే ప్రియురాలికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు. దీనిని తట్టుకోలేని ప్రియుడు మండపంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన ప్రియుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఓ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్న తరుణంలోనే వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు గమనించారు. వెంటనే ఆ యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఇటీవల వీరి పెళ్లికి హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాట్లు చేశారు. పెళ్లి జరుగుతందని వరుడు తట్టుకోలేకపోయాడు. తాళికట్టే సమయానికి ప్రియుడు వెంటనే పెళ్లి జరగుతున్న మండపానికి వెళ్లాడు.
ఇది కూడా చదవండి: దమ్ముంటే పట్టుకోండి.. స్కూల్ బోర్డుపై పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు!
వెంటనే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ని తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో మంటలు వేగంగా అంటుకోగానే ఆ యువకుడు వరుడిని హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన వరుడి బంధువులు వరుడిని పక్కకు లాక్కెళ్లారు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రియుడిని అతని కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇక అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రియుడు కన్నుమూశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.