హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నవాడే కాలయముడైతాడని ఆ ఇల్లాలు కలలో కూడా ఊహించలేకపోయింది. పెళ్లైన నాటి నుంచి భర్త అదనపు కట్నం తేవాల్సిందే అంటూ రోజూ వేధింపులకు దిగేవాడు. రోజు రోజుకు వేధింపులు తీవ్ర తరం కావడంతో ఆ మహిళ తట్టుకోలేక పడకగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కొండకరకం గ్రామానికి చెందిన సునీత అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో 2019లో వివాహం జరిగింది. అయితే రమేష్ ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా రమేష్ హైదరాబాద్ కు బదిలీ కావడంతో గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్ లో దంపతులు ఇద్దరు కాపురం పెట్టారు. అయితే కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు.
కానీ భర్త రమేష్ కు డబ్బు మీద వ్యామోహం ఉండడంతో భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. కొంత కాలం భర్త వేధింపులను భరించిన సునీత.., ఆగడాలు శ్రుతి మించడంతో తట్టుకోలేకపోయింది. ఇందులో భాగంగానే ఇటీవల గురువారం భర్త విధులకు వెళ్లగానే భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చి చూడగా భార్య వేలాడుతూ కనిపించే సరికి భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరతించారు.
అనంతరం భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక సునీత మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధించిన భర్త రమేష్ ని కఠినంగా శిక్షించాలంటూ సునీత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వరకట్న వేధింపులకు బలైన సునీత ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.