నాన్న.. నాకు లేకున్నా సరే నా పిల్లలకు ఇవ్వాలనుకుంటాడు. రెక్కలు ముక్కులు చేసుకుని కన్న పిల్లల కోసం అన్ని త్యాగం చేస్తాడు. తను పస్తులుండి పిల్లల కడుపునింపుతాడు. పుట్టినప్పటి నుంచి పెద్దవారై పెళ్లిళ్లు చేసుకున్నా కూడా కొడుకుల, కూతుళ్ల కోసమే ఆ తండ్రి పరితపిస్తుంటాడు. అలాంటి తల్లిదండ్రులను కొందరు కొడుకులు ఆస్తి, అంతస్తుల కోసం చంపడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు కన్న తండ్రిని కొడవలితో తెగ నరికి దారుణంగా హత్య చేశాడు.
తాజాగా హైదరాబాద్ చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్ విమాన్ నగర్ కు చెందిన అబ్రహంలింకన్ (84) గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్డ్ ఆ తర్వాత బీహెచ్ఈఎల్ పని చేసి అక్కడ కూడా రిటైర్డ్ అయ్యారు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు జన్మించగా ఓ కూతురు, కుమారుడు గతంలోనే మరణించారు. ఇక రెండవ భార్యకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. వీళ్లు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరు భార్యలు, అతని కుమార్తెలు, కూతుళ్లూ ఎవరూ పట్టించుకోకపోవడంతో అబ్రహం లింకన్ హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇదిలా ఉంటే
అబ్రహం లింకన్‌కు రిటైర్డ్ ఆర్మీ కోటాలో ప్రభుత్వం కేటాయించిన నాలుగన్నర ఎకరాల భూమి షాద్ నగర్ లో ఉండగా, శేరిలింగంపల్లిలో 200 గజాల 2ఖాళీ ప్లాట్లున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం రెండో భార్య కుమారుడు కిరణ్ ఈ స్థలాలను తండ్రికి తెలియకుండా నకిలీ గిఫ్ట్ డీడ్‌తో రూ.75 లక్షలకు విక్రయించాడు. కొడుకు తన ఆస్తులను అమ్ముతున్న విషయం తండ్రి అబ్రహం లింకన్ చెవిన పడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయి ఎందుకు అమ్ముతున్నావంటూ కొడుకును నిలదీశాడు.
ఇదే విషయమై కొడుకు, తండ్రి మధ్య అనేక సార్లు గొడవలు జరిగాయి. కిరణ్ షాద్ నగర్ లో ఉన్న నాలుగు ఎకరాల భూమి సైతం నా పేరు మీద రాయాలంటూ తండ్రిని బెదిరింపులకు గురి చేశాడు. ఎవరికీ ఇచ్చేది లేదంటూ తండ్రి కుమారుడికి వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి మాటలతో ఖంగుతిన్న కిరణ్ ఎలాగైన తండ్రిని హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక కోపంతో ఊగిపోయిన ఆయన కుమారుడు తండ్రి అబ్రహం లింకన్ ను కొడవలితో దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసిన ఈ ఘటనపైమీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా!