సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో నేటి కాలం యువతి యువకులు, ఇన్ స్ట్రాగ్రామ్, స్నాప్ చాట్ వంటి వాటిలో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన వీడియోలకు లైక్ లు కామెంట్స్ వస్తాయని, దీంతో తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోవచ్చని కలలు కంటుంటారు. ఇందులో భాగంగానే రోడ్డు, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ జనాలు ఎక్కడ ఉంటే అక్కడ సినిమా పాటలకు డ్యాన్స్ లు, వీడియోలు చేస్తున్నారు. ఎవరు ఏమనుకుంటారని అని కూడా ఆలోచించకుండా దిగజారి మరీ వీడియోలు చేస్తూ చర్చనీయాంశమవుతున్నారు.
ఇది కూడా చదవండి: చీ.. ఛీ.. లైకుల కోసం మరీ ఇంతలా దిగజారాలా? మండిపడుతున్న నెటిజన్స్!
అయితే ఇటీవల ఓ యువతి హైదరాబాద్ మెట్రోలో డ్యాన్స్ చేసిన వీడియో కాస్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో మెల్ల మెల్లగా మెట్రో అధికారుల కంట పడింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు యువతిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హైదాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు యువతిపై చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. అయితే ఆ యువతి డ్యాన్స్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రోలో డ్యాన్స్ చేసిన యువతిపై చర్యలకు సిద్దమైన అధికారుల నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.