భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఒకరికొకరు చర్చించుకుని సర్దుకుపోవాల్సింది పోయి కొందరు దంపతులు హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇల్లాలు కేవలం రూ.3 వేల కోసం తన నిండు ప్రాణాలు తీసుకుంది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన రాజు-రాగిణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
జీవనోపాధి కోసం కుటుంబమంతా హైదరాబాద్ కు వచ్చి నెక్నాపూర్ లో నివాసం ఉంటున్నారు. భర్త సెంట్రింగ్ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలం పాటు వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే ఇటీవల భర్త రాజు మొబైల్ ఫోన్ చెడిపోయింది. దీని మరమ్మత్తుల కోసం భార్యకు తెలియకుండా రూ.3 ఇంట్లో నుంచి తీసి ఖర్చు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య భర్తపై కోపంతో ఊగిపోయింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది.
ఇది కూడా చదవండి: నా వల్ల కావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!
దీంతో అలిగిన రాగిణి పుట్టింటికి వెళ్లి ఈ నెల 14న తిరిగి తన భర్త వద్దకు చేరుకుంది. దీంతో అదే రోజు రాగిణి ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన భర్త భార్యను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. ఇక పరిస్థితి విషమించడంతో రాగిణి శనివారం ప్రాణాలు విడిచింది. భార్య రాగిణి మరణించడంతో భర్త, పిల్లలను శోకసంద్రంలో మునిగిపోయారు. కేవలం రూ.3 వేల కోసమే ప్రాణాలు తీసుకున్న రాగిణి ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.