ఈ రోజుల్లో ఆడదానికి సమాజంలో రక్షణ లేకుండా పోతోంది. అందమైన అమ్మాయి రోడ్డుపై కనిపిస్తే చాలు.. ఐ లవ్ యు అని చెప్పడం, కాదంటే హత్యలు, ఆపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. చివరికి వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇకపోతే కొందరు దుర్మార్గులు మాత్రం వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ చిన్నపిల్లలు అని చూడకుండా అత్యాచార దాడులకు కాలు దువ్వుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని ఫిలింనగర్ లో ఓ వ్యక్తి (36) నివాసం ఉంటున్నాడు. వీరి ఇంటి పక్కనే ఇతని 7 ఏళ్ల మేనకోడలు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఆ బాలిక మేనమామ ఎప్పటి నుంచో ఆ చిన్నారిపై కన్నేశాడు. ఎలాగైన కోడలితో కోరిక తీర్చుకోవాలనే విషపు ఆలోచనలు నింపుకుని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక అతనికి ఆ సమయం కూడా రానే వచ్చింది.
ఇక పథకం ప్రకారం.. ఆ కిరాతకుడు ఇటీవల ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. కూతురు ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు గమనించి ఏం జరిగిందని ప్రశ్నించారు. కూతురు చెప్పిన మాటలతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఒంటి కాలుపై లేచారు. జరిగిన దారుణాన్ని తట్టుకోలేక ఆ చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.