హైదరాబాద్ లో జిమ్ సెంటర్ ను నడిపిస్తున్న ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. జిమ్ కు వచ్చిన ఓ బాలికతో గత కొంత కాలంగా స్నేహంగా మెలిగాడు. ఇక ఇంతటితో ఆగని ఆ జిమ్ ట్రైనర్ ఆ బాలికతో సన్నిహితంగా మెలిగాడు. కానీ ఆ బాలికకు అతడి ప్రవర్తనపై ఎలాంటి అనుమానం రాలేదు. అలా కొన్నిరోజుల గడిచిన తర్వాత జిమ్ ట్రైనర్ చేసిన పని తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ బాలిక లబోదిబోమంటూ నెత్తినోరు కొట్టుకుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఆ జిమ్ ట్రైనర్ ఆ బాలిక ఏం పంపాడు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ బోయిన్ పల్లిలో రాజు అనే యువకుడు గత కొంత కాలంగా జిమ్ సెంటర్ ను నడిపిస్తున్నాడు. ఇదే జిమ్ సెంటర్ కు స్థానికంగా ఉండే ఓ బాలిక గత కొన్నిరోజుల నుంచి రోజూ జిమ్ చేయడానికి వస్తూ ఉండేది. అయితే జిమ్ ట్రైనర్ రాజు ఆ బాలికకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే రాజు ఆ బాలికతో సన్నిహితంగా మెలుగుతు ఉండేవాడు. రాజు ట్రైనింగ్ ఇస్తూనే ఆ బాలిక జిమ్ చేస్తుండగా ఆమెకు తెలియకుండా ఆమె శరీర భాగాలను తన సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నాడు. అలా అతడు తీసుకున్న వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేసి అనంతరం ఆ బాలికకు పంపించాడు. ఆ వీడియోలు చూసిన ఈ బాలిక ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక ఇంతటితో ఆగని ఆ జిమ్ ట్రైనర్.. ఆ వీడియోలతో బాలికను బెదిరించాడు.
మీ ఇంట్లో నుంచి నగలు, డబ్బులు తేవాలని, లేకుంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక తన ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, రూ. 4 లక్షల నగదును అతని చేతిలో పెట్టింది. ఇక ఇంతటితో సంతృప్తి చెందని ఆ జిమ్ ట్రైనర్ మళ్లీ ఆ బాలికకు వేధింపులు గురిచేశాడు. తట్టుకోలేకపోయిన ఆ బాలిక వెంటనే ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పంది. ఇక కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆ బాలిక కుటుంబ సభ్యులు ఆ జిమ్ సెంటర్ ముందు ఆందోళన చెపట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.