పైన ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు సోమిరెడ్డి, మంజుల. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొడుకులను చిన్నప్పటినుంచి బాగా చదివించారు. అయితే ఉన్నత చదువులు చదివిన కుమారులు మంచి హోదాల్లో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు హైద్రాబాద్ లో ఉండగా, చిన్న కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. కానీ, సోమిరెడ్డి, మంజుల దంపతులు మాత్రం కూకట్ పల్లిలో నివాసం ఉంటున్నారు. కట్ చేస్తే ఇదే దంపతులు ఇటీవల ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ ఘటనలో ఏం జరిగిందనేది తెలుసుకుందాం.
సోమిరెడ్డి (65), మంజుల (58) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మియాపూర్ లో ఉంటుండగా, చిన్న కుమారుడు మాత్రం విదేశాల్లో ఉంటున్నాడు. అయితే ఈ దంపతులు మాత్రం కూకట్ పల్లిలోని వెంకట్రావు నగర్ లో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మంగళవారం ఈ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే సోమిరెడ్డి బావమరిది అదే రోజు బావ సోమిరెడ్డికి అనేక సార్లు ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు చేసినా.. బావ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మంజుల సోదరుడు హుటాహుటిన ఈ దంపతుల ఇంటికి వెళ్లాడు.
ఇక వీరి ఇంటి తలుపులు తెరిచి చూడగా.. సోమిరెడ్డి, మంజుల ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ఈ సీన్ ను చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వాళ్లు చనిపోయారని తెలుసుకున్న ఆ వ్యక్తి… అనంతరం ఈ దంపతుల కుమారులకు తెలియజేశాడు. ఈ సమాచారం అందుకున్న పెద్ద కుమారుడు తల్లిదండ్రుల ఇంటికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం ఈ ఘటనపై పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దంపతులు గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీని కారణంగానే వాళ్లు ఆత్మహత్యచేసుకుని ఉండొచ్చని వారి కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.