సంఘంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచి తమ సుఖాలకు ఎవరు అడ్డొచ్చిన అడ్డు తొలగించుకునేందుకు వెనకాడడం లేదు. తాళికట్టిన భర్తైన, చివరికి కడుపున పుట్టిన పిల్లలైన.., ఇలా ఎవరైనా కావచ్చు, అడ్డు తొలగించుకోవడమే వారి పని. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కసాయి తల్లి కన్న బిడ్డనే దారుణంగా హత్య చేసింది. అసలు ఆ తల్లికి కనిపెంచిన బిడ్డను హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అంతలా దారితీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లి పరిధిలోని ఓ గ్రామం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ భార్యాభర్తలకు పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో జీవనోపాధి లేకపోవడంతో గతంలో ఈ దంపతులు నగరానికి పయనమై ముషిరాబాద్ పరిధిలోని రాంనగర్ లో కాపురం పెట్టారు.
ఇక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఇటీవల వీరి బంధువుల్లో ఒకరు మరణిస్తే సొంతూరుకి వెళ్లారు. అక్కడికి వెళ్లాక వీరి బంధువైన ఒకతను ఇతని భార్యతో పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అంత్యక్రియలు పూర్తికాగానే ఆ దంపతులు తిరిగి నగరానికి వచ్చారు. ఫోన్ నెంబర్ తీసుకున్న వ్యక్తి ఈ దంపతులకు దగ్గరి బంధువు, పైగా ఆ మహిళకు సోదరుడు వరసు అవుతాడు. ఇవన్నీ మరిచిన ఆ మహిళ అతనితో సరదాగా మాట్లాడుతూ ఉండేది. అలా వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతను ఆ మహిళ వద్దకే వెళ్లాలనుకుని నగరానికి వచ్చి ఏకంగా ఈ దంపతులు ఉంటున్న ఏరియాలోనే ఓ ఇంట్లోకి అద్దెకు దిగాడు. వరసకు సోదరుడు అయ్యే ఈ వ్యక్తి ఈ దంపతులు ఇంటికి వస్తూ ఉండేవాడు. దీంతో ఆమె భర్త పెద్దగా అనుమానం రాలేదు.
ఇక భర్త గడప దాటేదే ఆలస్యం.. ఆ మహిళ ఏకంగా ప్రియుడిని ఇంట్లోకి రప్పించుకుని ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే గత నెల 8వ తేదీన ఆ మహిళ ప్రియుడితో పాటు ఇంట్లో ఉండగా ఆ వివాహిత కుమారుడు అంగన్ వాడి కేంద్రం నుంచి ఇంటికి వచ్చాడు. అలా రోజు వీరిద్దరూ ఏకాంతంగా ఉండే సమయంలోనే ఆ బాలుడు వస్తూ ఉండేవాడు. సరైన టైమ్ కే కుమారుడు వస్తుండడంతో ఆ మహిళ బాగా విరక్తి చెందింది. ప్రియుడితో పాటు కలిసి ఉన్న సమయంలోనే వస్తుండడంతో తల్లి కోపంతో ఊగిపోయింది. తన కుమారుడు లేకుంటే ఎంచక్కా ప్రియుడితో గడిపేయొచ్చు అనుకుంది. ఇందులో భాగంగానే ఆ మహిళ ప్రియుడితో పాటు కలిసి తన మూడేళ్ల బాలుడిని హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఇద్దరు కలిసి ఆ బాలుడిని దారుణంగా కొట్టారు.
ఇదే కాకుండా బాలుడి మలద్వారం ద్వారా బలమైన వస్తువును గుచ్చారు. ఇక నొప్పిని భరించలేని ఆ బాలుడు వాంతులు చేసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆ బాలుడు ఇటీవల మరణించాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. స్థానికుల సమాచారం మేరకు తల్లిపై అనుమానం ఉండడంతో పోలీసులు ఆ మహిళను విచారించారు. నా కుమారుడు కిందపడే మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది.
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆ మహిళపై పోలీసులకు అనుమానం బలపడింది. తమదైన స్టైల్ లో విచారించగా.., ఎట్టకేలకు ఆ మహిళ తమ శారీరక సుఖానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే ప్రియుడితో పాటు కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. ఆ మహిళ చెప్పిన నిజాలు విని కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులు ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడి కోసం కడుపున పుట్టిన కొడుకును హత్య చేసిన ఈ దుర్మార్గురాలికి ఎలాంటి శిక్ష విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.