హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం స్నేహితురాలితో కలిసి డ్యూటీకి వెళ్ళిన ఓ యువతి ఉన్నట్టుండి తల నొప్పి, వాంతులు రావడంతో భరించలేకపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయత్నం లేకపోవడంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా పెద్దభీంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష (22) హైదరాబాద్ అబిడ్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాషీయర్‌గా పనిచేస్తూ కింగ్‌కోఠిలోని ఓ హాస్టల్లో నివాసం ఉంటోంది.
అయితే రోజులాగే సోమవారం అనూష తన స్నేహితిరాలితో కలిసి డ్యూటీకి వెళ్లింది. ఉన్నట్టుండి ఆమెకు భరించలేని తలనొప్పి స్టార్ట్ అయింది. ఇక పని చేయలేని అనూష వెంటనే హాస్టల్ కి వచ్చేసింది. సాయంత్రం వరకూ అలాగే నొప్పిని భరిస్తూ హాస్టల్ లో పడుకుంది. దీంతో నొప్పి మరింత ఎక్కువవడంతో తోటి స్నేహితులు గమనించి ఆమెను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అనూషను ఆటోలో తీసుకెళ్తుండగా వాంతులతో పాటు నోటి నుంచి నురగలు రావడం స్టార్ అయింది.
కింగ్ కోఠిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగితేలారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనూష మరణించడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నట్టుండి తలనొప్పి ఇతర కారణాలతో మరణించిన అనూష మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.