రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రపోకుండా చేస్తుందని ఓ యువకుడు పిల్లిని పెంచుతున్న వ్యక్తిని హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని మిథిలానగర్ లోని ఓ ఇంట్లో రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం నల్లాపూర్ గ్రామానికి చెందిన బాలుడి (17)తో పాటు హరీశ్వర్ రెడ్డి (20) అనే ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే వీరితో పాటు అస్సాంకు చెందిన ఎజాజ్ హుస్సేన్, బ్రాన్ స్టిల్లింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఇదిలా ఉంటే ఎజాజ్ హుస్సేన్ ఇటీవల ఓ పెంపుడు పిల్లిని తెచ్చుకుని వారి గదిలో పెంచుకున్నాడు. అది రోజు అరుస్తూ స్థానికులను నిద్రపోకుండా చేస్తుంది. అయితే ఆ పిల్లి అరుస్తుండడంతో వీరి పక్కగదిలోనే నివాసం ఉంటున్న హరీశ్వర్ రెడ్డి, బాలుడిబ ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ బాలుడు మద్యం మత్తులో ఎజాజ్ హుస్సేన్ రూమ్ లోకి దూసుకెళ్లాడు. అక్కడే ఉన్న పెట్రోల్ బాటిల్ ను అతనిపై పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు అంటుకుని అతను అరుపులు వేయడంతో స్థానికులు వారి రూమ్ వద్దకు పరుగు పరుగున వచ్చారు.
వెంటనే మంటలు ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఎజాజ్ హుస్సేన్ గురువారం మరణించాడు. మృతుడి స్నేహితుడైన బ్రాన్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఆ బాలుడితో పాటు హరీశ్వర్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పిల్లి అరుస్తుందని దాని యజమానిని చంపిన ఈ దుర్మార్గుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.