నేటి కాలంలో కొందరు పెళ్లైన మహిళ పాడు బుద్దితో రచ్చకెక్కుతున్నారు. అభం, శుభం తెలియని మైనర్ బాలురులను తమ వలలో వేసుకుని శారీరక కోరికలు తీర్చుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల 30 ఏళ్ల మహిళ 15 ఏళ్ల బాలుడిని ట్రాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇది మరువకముందే అచ్చం ఇలాంటి ఘటనే మరోకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ 30 ఏళ్ల మహిళ 19 ఏళ్ల కుర్రాడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది. ఆ మహిళ చెర నుంచి నా కుమారుడిని రక్షించాలంటూ ఆ యువకుడి తండ్రి ఏకంగా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుబ్బరావు అనే వ్యక్తి గచ్చిబౌలిలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు అలెక్స్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే స్థానికంగా ఉండే ఓ 30 ఏళ్ల మహిళ అలెక్స్ ను ప్రేమ పేరుతో ట్రాక్ లోకి దింపుకుంది. ఆ కుర్రాడికి ఎన్నో మాయమాటలు చెప్పి అతనికి దగ్గరై అన్ని కోరికలు తీర్చుకుంటుంది. దీనిని గమనించిన అలెక్స్ తల్లిదండ్రులు అనేక సార్లు మందలించినా కూడా ఆమె బుద్దిమారలేదు.
ఇక ఈ క్రమంలోనే జూన్ 26న ఇంట్లో నుంచి వెళ్లిన అలెక్స్ ఇంత వరకు ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. అయినా అతని కుమారుడి జాడ మాత్రం కనిపంచలేదు. ఆ మహిళపైనే అనుమానమొచ్చిన ఆ యువకుడి తల్లిదండ్రులు ఆమె తీసుకెళ్లిందని నిర్దారించుకున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా మా కుమారుడు మేజర్ అన్న కారణంతో అస్సలు పట్టించుకోవడం లేదని తండ్రి వాపోయాడు. ఇక లాభం లేదని భావించిన అలెక్స్ తండ్రి ఏకంగా మానవ హక్కలు కమిషన్ ను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు.
నా కుమారుడిని 30 ఏళ్ల మహిళ ట్రాప్ చేసి తీసుకెళ్లిందని, ఆమె చర నుంచి నా కుమారుడిని రక్షించాలంటూ వేడుకున్నారు. ఏం తెలియని మా కుమారుడిని ప్రేమ, పెళ్లితో వాడి జీవితం నాశనం చేస్తుందని, ఎలాగైన ఆ మహిళ నుంచి నా కుమారుడిని రక్షించాలంటూ అలెక్స్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.