హైదరాబాద్ లో కొందరు నిర్వాహకులు అద్దె గదుల్లో గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. నిరుపేద అమ్మాయిలను, మహిలను టార్గెట్ గా చేసుకుని పాడు పనులకు నిర్వహిస్తూ తాజాగా పోలీసులకు అడ్డంగా దొరికారు.
హైదరాబాద్ లో గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు నిరుపేద అమ్మాయిలు, మహిళలను టార్గెట్ చేసుకుని చీకటి దందాకు తెర లేపుతున్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళలు, అమ్మాయిలను రప్పించుకుని అద్దె గదుల్లో గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా షాద్ నగర్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కొందరు నిర్వాహకులను అరెస్ట్ చేసి ఓ యువతిని రక్షించారు. అయితే ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వ్యభిచార గట్టు రట్టు అయింది.
పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లిలోని పీఎన్ నగర్ లో కొందరు నిర్వాహకులు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇక నిరుపేద అమ్మాయిలను, మహిళలను టార్గెట్ గా చేసుకుని వ్యభిచారాన్ని నడిపిస్తూ పాడు పనులకు తెర లేపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. దీంతో పాటు ఇద్దరు మహిళలను సైతం పోలీసులు రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.